newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

11-07-202011-07-2020 08:14:39 IST
Updated On 11-07-2020 08:15:24 ISTUpdated On 11-07-20202020-07-11T02:44:39.716Z11-07-2020 2020-07-11T02:44:37.148Z - 2020-07-11T02:45:24.386Z - 11-07-2020

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆసియాక‌ప్ నిర్వ‌హిద్దామ‌నుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గ‌ట్టి షాక్ ఇచ్చింది. క‌రోనా నేప‌థ్యంలో ఆసియా‌ క‌ప్ నిర్వహణ సాధ్యం కాదంటూ జూన్ 2021కి వాయిదా వేస్తున్న‌ట్లు గురువారం నిర్వ‌హించిన స‌మావేశం అనంత‌రం ఏసీసీ ప్ర‌క‌టించింది. 2021లో నిర్వ‌హించ‌నున్న ఆసియాక‌ప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొంది. కాగా ఏసీసీ స‌మావేశానికి ఒక‌రోజు ముందే బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఒక మీడియా చానెల్‌తో మాట్లాడుతూ క‌రోనా దృష్యా ఆసియా క‌ప్ ర‌ద్దు కానుందని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. గంగూలీ చేసిన వాఖ్య‌ల‌ను నిజం చేస్తూ ఆసియా క‌ప్‌ను వ‌చ్చే ఏడాదికి వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం.

కాగా అంత‌కముందు గంగూలీ వ్యాఖ్యల‌ను ఖండిస్తూ  పీసీబీ మీడియా డైరెక్టర్‌ శామ్యూల్‌ హసన్ ఘాటుగా స్పందించారు. గంగూలీ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్‌ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అని తెలిపారు. అయితే ముందుగా అనుకున్న ప్ర‌కారం ఆసియా క‌ప్‌ను పాక్ నిర్వ‌హించాల్సి ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా నేప‌థ్యంలో పీసీబీ సెప్టెంబ‌ర్‌లో టోర్నీని నిర్వ‌హించాల‌నుకుంది. ఒక‌వేళ ప‌రిస్థితులు అనుకూలిస్తే శ్రీలంకలో ఆసియా క‌ప్‌ను నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, శ్రీలంక‌లో  సాధ్యం కాక‌పోతే యూఏఈలో టోర్నీని నిర్వ‌హిస్తామ‌ని గ‌తంలో పీసీబీ ఛైర్మ‌న్ వసీం ఖాన్ స్ప‌ష్టం చేశారు.  

అయితే జూన్ 2021లో నిర్వ‌హించ‌నున్న ఆసియాక‌ప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వ‌నున్న‌ట్లు ఏసీసీ తాజా ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. కాగా ఏసీసీ తాజా ప్ర‌క‌ట‌నతో పీసీబీకి పెద్దదెబ్బే త‌గిలింద‌ని చెప్పొచ్చు.‌ తాజాగా టోర్నీని వాయిదా వేయాల‌ని ఏసీసీ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మార్గం మ‌రింత సుగ‌మమ‌యింది. 

ఆసియా కప్ రద్దుపై గంగూలీ చేసిన వ్యాఖ్యలకు విలువ లేదు.. పీసీబీ

అంతకు ముందు.. ఆసియా కప్ రద్దయిందంటూ బీసీసీఐ చీఫ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి విలువ లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామియుల్ హసన్ బర్నీ అన్నారు. ఆసియా కప్ భవిత్యాన్ని చెప్పాల్సింది గంగూలీ కాదని, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అని అన్నారు. ఆసియా కప్ రద్దయినట్టు గంగూలీ బుధవారం ప్రకటించాడు. అయితే, అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆతిథ్య దేశాన్ని నిర్ణయించడంలో వైఫల్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘‘డిసెంబరులో తొలి పూర్తి స్థాయి సిరీస్ ఉంటుంది. సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేశాం’’ అని గంగూలీ పేర్కొన్నాడు. 

అయితే, గంగూలీ వ్యాఖ్యలను హసన్ తప్పుబట్టాడు. ఇలాంటి ముఖ్యమైన ప్రకటనను కేవలం ఏసీసీ అధ్యక్షుడు మాత్రమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రొసీడింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొన్నారు. అతడు ప్రతీవారం ఇలాంటి వ్యాఖ్యలే చేసినా వాటికి ఏమాత్రం విలువ, యోగ్యత ఉండదని హసన్ తేల్చి చెప్పారు. ఆసియా కప్‌పై ఎటువంటి నిర్ణయమైనా ఏసీసీ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న హసన్.. ఇలాంటి ప్రకటనను ఏసీసీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. తమకు తెలిసినంత వరకు ఏసీసీ తదుపరి సమావేశం గురించి ఇంకా ప్రకటించాల్సి ఉంటుందని హసన్ స్పష్టం చేశారు.  

ఆసియా కప్ టోర్నీ రద్దయినట్లు ప్రకటించే అర్హత గంగూలీకి లేదని, ఏసీసీ మాత్రమే ప్రకటించాలని హసన్ ప్రకటన చేసి 12 గంటలు కూడా గడవక ముందే ఏసీసీ కూడా గంగూలీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle