newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టీ20 లీగ్ షెడ్యూల్‌ ఇదే!

15-07-202015-07-2020 13:27:54 IST
Updated On 15-07-2020 14:49:47 ISTUpdated On 15-07-20202020-07-15T07:57:54.194Z15-07-2020 2020-07-15T07:57:49.063Z - 2020-07-15T09:19:47.455Z - 15-07-2020

ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టీ20 లీగ్ షెడ్యూల్‌ ఇదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా వేదికగా ఏటా జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్ షెడ్యూల్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్యంపై స్పష్టత ఇవ్వలేకపోతున్న సీఏ.. బిగ్‌బాష్‌ లీగ్ షెడ్యూల్‌ని మాత్రం పక్కా క్లారిటీతో ప్రకటించేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 3 నుంచి బిగ్ బాష్ లీగ్ ప్రారంభంకానుండగా.. గత ఏడాదితో పోలిస్తే 14 రోజులు ముందే ఈ టోర్నీ ప్రారంభంకాబోతుంది. 

మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. కరోనా వైరస్ నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేసింది. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే..? ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని యోచిస్తుంది. 

బీసీసీఐ.. ఐసీసీ ప్రకటించే ఆ టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయం కోసం గత మూడు నెలలుగా ఎదురుచూస్తోంది. కానీ.. బీసీసీఐని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఐసీసీ మరింత నాన్చుడి ధోరణిలో వ్యవహరిస్తోంది.

ఐపీఎల్ షెడ్యూల్‌పై ఒకవైపు బీసీసీఐ గందరగోళంలో పడిపోగా.. మరోవైపు వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ ప్రైవేట్ టీ20 లీగ్స్ షెడ్యూల్స్‌ని రోజుల వ్యవధిలోనే ప్రకటించేశాయి.

రెండు రోజుల క్రితం విండీస్ బోర్డు తమ దేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించగా.. తాజాగా బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) డిసెంబరు 3 నుంచి స్టార్ట్ అవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.

ఈ రెండు టోర్నీలు.. ఐపీఎల్‌తో క్లాస్ అవకుండా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటిస్తే బీసీసీఐ మరింత ఇరకాటంలో పడుతుంది.

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle