newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఆసీస్ టార్గెట్ 341.. థావన్ సెంచరీ మిస్

17-01-202017-01-2020 17:24:21 IST
2020-01-17T11:54:21.193Z17-01-2020 2020-01-17T11:54:09.326Z - - 26-02-2020

ఆసీస్ టార్గెట్ 341.. థావన్ సెంచరీ మిస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన‌ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 340 ర‌న్స్ చేసింది. భార‌త జ‌ట్టులో రోహిత్‌, ధావ‌న్‌, కోహ్లీ, రాహుల్‌లు రాణించారు.

రోహిత్ శ‌ర్మ 42 ర‌న్స్‌, శిఖ‌ర్ ధావ‌న్ 96, కోహ్లీ 78 ర‌న్స్ చేశారు. ధావ‌న్ సెంచ‌రీ మిస్ కాగా, కోహ్లీ వ‌న్డేల్లో 56వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇక కేఎల్ రాహుల్‌.. ఆసీస్ బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొన్నాడు. త‌న ఖాతాలో మ‌రో హాఫ్ సెంచ‌రీ వేసుకున్న రాహుల్‌.. వ‌న్డేల్లో వెయ్యి ప‌రుగుల మైలురాయిని దాటేశాడు.

ఈ మ్యాచ్‌లో రాహుల్ శ‌ర‌వేగంగా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేయడం విశేషం. రాహుల్ వ్య‌క్తిగ‌తంగా 80 ర‌న్స్ చేసి ర‌నౌట్ అయ్యాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జంపా మూడు, రిచ‌ర్డ్‌స‌న్ రెండు వికెట్లు తీసుకున్నారు.ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 50వ హాఫ్ సెంచరీ మిస్ చేశాడు. సెంచరీకి సరిగ్గా నాలుగు పరుగుల ముందు ఓపెనర్ శిఖర్ ధవన్ అవుటయ్యాడు. 90 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 96 పరుగులు చేసిన ధవన్.. కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఆడమ్‌ జంపాకే మరోసారి అవుట్ కావడం అభిమానులకు షాకిచ్చింది. ఆడమ్‌ జంపా వేసిన 44 ఓవర్‌ తొలి బంతిని భారీ షాట్‌ ఆడి పెవిలియన్‌ చేరాడు.

అయితే కోహ్లి కొట్టిన ఆ షాట్‌ను చూసి సిక్స్‌ అనుకున్నారు. కానీ కోహ్లి కొట్టిన బంతి ఫీల్డింగ్‌ చేస్తున్న ఆగర్‌ కి దొరికిపోయింది.. బౌండరీ లైన్ దగ్గర్లో దీనిని పట్టుకున్న ఆగర్ దాన్ని మరో ఫీల్డర్‌ స్టార్క్‌కు విసిరేశాడు. ఇది ఆగర్‌ బౌండరీ లైన్‌ను దాటకముందే  స్టార్క్‌ కు అందివ్వడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఆగర్‌ కాలు గాల్లో ఉండగానే స్టార్క్‌కు ఇవ్వడంతో కోహ్లి ఔటయ్యాడు. దాంతో కోహ్లి 78 వ్యక్తిగత పరుగుల వద్ద నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. జంపా బౌలింగ్‌లో కోహ్లి ఔట్‌ కావడం వన్డేలు, టీ20ల్లో కలుపుకుని ఇది ఏడోసారి.

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

   12 hours ago


మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

   15 hours ago


సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

   24-02-2020


క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

   21-02-2020


పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

   20-02-2020


పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

   19-02-2020


కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

   18-02-2020


మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

   18-02-2020


కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

   18-02-2020


సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

   17-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle