newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆసీస్‌తో సీరీస్ కష్టమే..కానీ కోహ్లీ గెలుస్తాడని నమ్ముతున్నా.. సౌరవ్ గంగూలీ

16-07-202016-07-2020 15:26:09 IST
Updated On 16-07-2020 16:09:10 ISTUpdated On 16-07-20202020-07-16T09:56:09.903Z16-07-2020 2020-07-16T09:56:05.443Z - 2020-07-16T10:39:10.066Z - 16-07-2020

ఆసీస్‌తో సీరీస్ కష్టమే..కానీ కోహ్లీ గెలుస్తాడని నమ్ముతున్నా.. సౌరవ్ గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు పర్యటన ఖాయమైన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొండంత ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాలో ఓడించి 2-1 తో సీరీస్ గెల్చుకుని చరిత్ర సృష్టించిన టీమిండియా కోహ్లీ నేతృత్వంలో మరోసారి సీరీస్ సాధించుకు రావాలని గంగూలీ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మూడు మ్యాచ్‌ల టీ20 సీరీస్ కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇరుదేశాల మధ్య సీరీస్ జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది కూడా చూడాల్సిన విషయమే. 

ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ రాబోయే సీరిస్‌లో గెలుపు గురించి ఇప్పటికే కోహ్లీతో మాట్లాడానని చెప్పారు. నువ్వు విరాట్ కోహ్లీవి, నీ ప్రమాణాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటున్నాయి. నీవు మైదానంలోకి నీ జట్టుతో పాటు వెళుతున్నప్పుడు, నేను టీవీలో మిమ్మల్ని చూస్తుంటాను. కానీ ఆస్ట్రేలియాతో మీరు సాదాసీదాగా ఆడతారని నేను అనుకోను. మీరు గెలవాలని నా అంచనా అని కోహ్లీకి చెప్పానని గంగూలీ తెలిపాడు.

ఎందుకంటే నీవు ఇప్పటికే నీదైన ప్రమాణాలను నెలకొల్పావు. అది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీవు నీ ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలి అని కోహ్లీతో చెప్పాను.

ఆసీస్‌తో సీరీస్ సందర్భంగా నేను చాలాసార్లు కోహ్లీతో మాట్లాడాను. మొత్తం జట్టు ఫిటనెస్ స్థాయిని నిలుపుకోవడం కరోనా నేపథ్యంలో చాలా అవసరమని హెచ్చరించాను.  

ఎందుకంటే గత ఆరునెలలుగా కోహ్లీ, తన జట్టు సభ్యులు క్రికెట్ ఆడలేదు. నీ ఫాస్ట్ బౌలర్లు ఇలా వచ్చి అలా గాయపడి వెళ్లిపోవాలని నీవు అస్సలు కోరుకూకూడదు. వారు తప్పక శిక్షణ పొందాలి. కానీ శిక్షణ పొందడం, మైదానంలో ఆడటం పూర్తిగా భిన్నమైనవి అని కోహ్లీకి చెప్పాను.

ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. నీ ఫాస్ట్ బౌలర్లు టూర్ మొత్తంమీద ఫిట్‌గా ఉండాల్సిన  అవసరం చాలా ముఖ్యం. అది షమీ అయినా, బుమ్రా అయినా, ఇషాంత్ అయినా, హార్దిక్ పాండ్యా అయినా మ్యాచ్ ఫిట్‌నెస్‌ విషయంలో వారు అగ్రస్థానంలో ఉండాలి. 

ఆస్ట్రేలియాతో సీరీస్ చాలా కఠినంగా సాగుతుంది. 2018లో టీమిండియా అక్కడికి వెళ్లినప్పటిలా తాజా సీరీస్ ఉండదు. అత్యంత శక్తివంతమైన ఆసీస్ జట్టుతో తలపడబోతున్నారు. కానీ మన జట్టు కూడా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ టీమిండియా బలంగా ఉంది. కానీ ఫిట్‌నెస్ కలిగి ఉండటం సీరీస్ మొత్తం మీద దాన్ని కొనసాగించడం చాలా అవసరమని కోహ్లీతో చెప్పాను అని గంగూలీ పేర్కొన్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle