newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

09-07-202009-07-2020 11:04:52 IST
Updated On 09-07-2020 12:32:43 ISTUpdated On 09-07-20202020-07-09T05:34:52.687Z09-07-2020 2020-07-09T05:34:49.636Z - 2020-07-09T07:02:43.222Z - 09-07-2020

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ రద్దయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే ఆసియా కప్‌ నిర్వహించాలా వద్దా అనే దానిపై ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ గురువారం (జూలై 9న) జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఒకరోజే ముందే గంగూలీ ఆసియా కప్‌ రద్దు అయినట్లు  ప్రకటించడం విశేషం. బుధవారం ఒక ప్రముఖ మీడియాతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న గంగూలీని. భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ జట్టును తిరిగి మైదానంలో ఎప్పుడు చూస్తామని ప్రశ్నించారు.

Asia Cup is cancelled, says BCCI president Sourav Ganguly

దీనిపై గంగూలీ స్పందిస్తూ.. 'టీమిండియా మొదట ఏ సిరీస్‌ ఆడుతుందో చెప్పడం కష్టం. కరోనా వైరస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. మనం చేయగలిగేది వేచి ఉండటమే. అయితే ఐపీఎల్ 2020 వాయిదా పడింది. టీ 20 ప్రపంచ కప్ పై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటే... మనం ఐపీఎల్ గురించి ఆలోచించగలము. ఇక సెప్టెంబరులో  జరగాల్సిన ఆసియా కప్ రద్దు చేయబడింది. కాబట్టి భారతదేశంలో క్రికెట్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో ప్రస్తుతానికి నేను చెప్పలేను' అని తెలిపాడు. 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ ఈ ఏడాది చివర్లో శ్రీలంకలో లేదా యుఎఇలో షెడ్యూల్ చేసిన విధంగా ఆసియా కప్ 2020 ముందుకు సాగుతుందని హామీ ఇచ్చిన కొద్ది రోజులకే గంగూలీ ఈ ప్రకటన చేశాడు. అయితే ఈ విషయం పై పీసీబీ ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.  

2020ని ఐపీఎల్ నిర్వహించకుండా ముగించాలని భావించడం లేదు.. గంగూలీ వ్యాఖ్య

భారత్‌లో కరోనా కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020ని ఐపీఎల్ నిర్వహించకుండా ముగించాలని భావించడం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌ ఒకవేళ జరిగినా భారత్‌లో జరగకపోవచ్చనే వార్తలపై కూడా దాదా స్పందించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలన్న ప్రశ్న ఉత్పన్నమైతే తమ మొదటి ప్రాధాన్యం భారత్ అని, 35 నుంచి 40 రోజుల వ్యవధి లభించినా ఐపీఎల్ నిర్వహించవచ్చని గంగూలీ తెలిపారు. 

విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించడం అంత సాధ్యమైన పని కాదని, ఒకవేళ నిర్వహించాల్సి వచ్చినా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఫ్రాంచైజీలపై తీవ్ర భారం పడుతుందని చెప్పారు. అయితే.. భారత్‌లో నిర్వహిస్తామని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేమని దాదా తేల్చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై జట్లు ఐపీఎల్‌లో పెద్ద టీంలని, అయితే.. ఇప్పుడు ఆ నగరాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడ మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదని గంగూలీ తెలిపారు. అహ్మదాబాద్‌ స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు అద్భుతంగా ఉంటుందని, ప్రస్తుతం పరిశీలిస్తున్నామని.. అయితే.. అక్కడ మ్యాచ్‌లు జరిగేది.. లేనిది ఇప్పుడే చెప్పలేమని గంగూలీ వ్యాఖ్యానించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle