newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్సీబీ కొత్త లోగో ఇదే..

14-02-202014-02-2020 18:18:36 IST
2020-02-14T12:48:36.239Z14-02-2020 2020-02-14T12:48:33.320Z - - 12-04-2021

ఆర్సీబీ కొత్త లోగో ఇదే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకునే జట్లలలో రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆఫ్ బెంగళూరు ఒకటి. ఐపీఎల్‌ ముందు ప్రతిసారి ఆ జట్టు టైటిల్ రేసులో ఉంటుందని అభిమానులు ఆశిస్తుంటారు. విరాట్ కోహ్లీ, ఏబీడివిలియర్స్‌ వంటి స్టార్లు ఆ జట్టు సొంతం. అయినా ఇప్పటి వరకు ఆ జట్టు టైటిల్‌ను కొట్టలేదు. టైటిల్ ఇప్పటి వరకు అందని ద్రాక్ష గానే మిగిలింది. 13వ సీజన్‌లో ఎలాగైనా టైటిల్ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది యాజమాన్యం. అందుకు అనుగుణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ వేలంలో ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకుంది.

గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తమ టీమ్ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుని.. సరికొత్త లొగోతో బరిలోకి దిగింది. దీంతో.. గత ఐదారు సీజన్లుగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాల్లో కనిపించిన ఆ జట్టు.. 2019 ఐపీఎల్ సీజన్‌లో మాత్రం కొన్ని రోజులు టేబుల్ టాపర్‌గా నిలిచింది. ప్లేఆఫ్‌లో చెన్నై చేతిలో ఓడిన ఢిల్లీ.. టైటిల్‌కి అడుగు దూరంలో నిలిచిపోయింది.  ఆ జట్టు ప్రదర్శన అభిమానులకు ఆకట్టుకుంది.

ఇప్పుడు అదే బాటలో ఆర్‌సీబీ నడుస్తోంది. ఐపీఎల్-2020 సీజన్‌కు సరికొత్త లోగో తో బరిలోకి దిగనుంది. కొత్త దశాబ్దం.. కొత్త లొగోతో ఐపీఎల్‌లో బరిలోకి దిగబోతున్నట్లు ఈరోజు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు టీమ్ సోషల్ మీడియా అకౌంట్స్‌లోనూ ప్రొఫైల్ ఫొటోల్ని మార్చింది.

ఈ సందర్భంగా ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్‌ చురివాలా మాట్లాడుతూ.. ఆర్‌సీబీకి అండగా నిలుస్తున్న అభిమానులకు వినోదాన్ని పంచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపేలా లోగోలోని అంశాలను మార్చాం అని తెలిపాడు.

ఇటీవల టీమ్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్‌ నుంచి ఫొటోల్ని తొలగించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చాహల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఐపీఎల్ 2020 సీజన్‌కి జట్టులోనూ అనూహ్య మార్పులు చేసిన ఆర్సీబీ.. వేలంలో అరోన్ ఫించ్, క్రిస్‌ మోరీస్, కేన్ రిచర్డ్‌సన్, డేల్ స్టెయిన్ తదితరుల్ని కొనుగోలు చేసి బలంగా కనిపిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle