facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

ఆర్మీ క్యాప్‌లతో అమర జవాన్లకు సలాం

08-03-201908-03-2019 16:39:07 IST
Updated On 08-03-2019 16:56:51 ISTUpdated On 08-03-20192019-03-08T11:09:07.027Z08-03-2019 2019-03-08T10:53:53.448Z - 2019-03-08T11:26:51.688Z - 08-03-2019

ఆర్మీ క్యాప్‌లతో అమర జవాన్లకు సలాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు జాతియావత్తూ నివాళి అర్పిస్తోంది. అమరుల కుటుంబాలకు తమవంతు సాయం చేస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో మ్యాచ్ సందర్భంగా టీమిండియా జట్టు తమ దేశభక్తిని చాటుకుంది. టీమిండియా ఆటగాళ్ళంతా ప్రత్యేకంగా ఆర్మీ క్యాప్స్ ధరించింది. మ్యాచ్ జరగడానికి ముందు భారత జట్టు ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్మీ క్యాప్స్ ను అందించాడు. ఆ టోపీలను పెట్టుకున్న ఆటగాళ్లు…పుల్వామా అమర జవాన్లకు నివాళులు అర్పించారు.

అంతేకాదు అమరజవాన్ల పిల్లల చదువులకు, కుటుంబాలను ఆదుకునేందుకు నడుం బిగించారు.  ఇవాళ్టి మ్యాచ్ ఫీజును ఆటగాళ్లు జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి నిధులు సమకూర్చేలా.. జట్టు ఆటగాళ్లంతా ఆర్మీ క్యాప్స్ ధరించాలని ధోనీ , కోహ్లీ నిర్ణయించినట్టు  టీమ్ తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన క్యాప్స్ ధరించిన విరాట్ కోహ్లీ దేశమంతా అమర జవాన్ల కుటుంబాల వెంటే ఉందన్నాడు. టీమిండియా ఉడతాభక్తిగా మ్యాచ్ ఫీజుని విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించాడు. టీమిండియా స్ఫూర్తిని పలువురు అభినందించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle