newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

ఆటగాళ్ల వెంట నిఘా నీడ

15-05-201915-05-2019 15:14:27 IST
2019-05-15T09:44:27.925Z15-05-2019 2019-05-15T09:44:23.197Z - - 21-08-2019

ఆటగాళ్ల వెంట నిఘా నీడ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఐసీసీ కఠినచర్యలకు దిగుతోంది. మరో 15 రోజులలో ప్రపంచ కప్ సంరంభం మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంటుకు ఎలాంటి మచ్చ తీసుకొని రావొద్దని ఐసీసీ క్రీడాకారులను కోరుకుంటోంది. అందుకే ఈసారి ప్రతీ జట్టు వెంట ఒక నిఘా అధికారిని నియమించింది ఐసీసీ. 

ఈ అధికారి ఆయా జట్లతొ పాటే ఉంటారు. అతనికి ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూములతో సహా.. హోటల్ రూముల్లోకి కూడా ప్రవేశం కల్పించింది. వారితో పాటే తిని, తిరిగి, ప్రయాణం చేసి ఎల్లవేళలా వారిపై ఆ అధికారి నిఘా ఉంచుతాడు. అధికారిక మ్యాచ్‌లు జరిగే సమయంలోనే కాకుండా సన్నాహక మ్యాచ్‌లు జరిగే సమయంలోనూ ఈ అధికారి వెన్నంటి ఉంటాడు. ప్రపంచ కప్‌ను మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి రహిత టోర్నీగా నిర్వహించాలని ఐసీసీ కంకణం కట్టుకుంది. అందుకే ఇంత కఠినమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. ఐసీసీ నిర్ణయం ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle