newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆగస్టు తొలి వారంలో ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్

29-07-202029-07-2020 09:09:07 IST
2020-07-29T03:39:07.584Z29-07-2020 2020-07-29T03:38:45.212Z - - 04-08-2020

ఆగస్టు తొలి వారంలో ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దూకుడు పెంచింది. కరోనా ముప్పు ఉండడంతో ఈసారి లీగ్‌ను యూఏఈలో నిర్వహించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. 

ఇందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రానప్పటికీ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.ఈ వీకెండ్‌లో లీగ్‌కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) మీటింగ్‌కు పిలుపునిచ్చింది. ఈ సమావేశం విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్వయంగా వెల్లడించారు.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా కూడా ఆదివారం జరిగే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. స్టేక్ హోల్డర్ల సందేహాలను వీరిద్దరూ క్లియర్ చేస్తారని భావిస్తున్నారు. ఈ మీటింగ్ అనంతరం ఫ్రాంచైజీలకు ఈ సీజన్ ఐపీఎల్‌పై ఫుల్ క్లారిటీ వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

అంతేకాక ఈసారి లీగ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసీజర్(ఎస్ఓపీ)ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది. దీంతో ప్లేయర్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను యూఏఈ తీసుకెళ్లాలా లేదా అనే దానిపై క్లారిటి వస్తుంది. ఖాళీ స్టేడియంలో లీగ్ జరగనుండడం వల్ల ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో రెవెన్యూ నష్టపోనున్నాయి. ఈ అంశంపై గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చిస్తామని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle