newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆఖరి టెస్ట్.. పడిలేస్తున్న ఇంగ్లండ్

25-07-202025-07-2020 11:00:04 IST
2020-07-25T05:30:04.991Z25-07-2020 2020-07-25T05:29:49.263Z - - 20-04-2021

ఆఖరి టెస్ట్.. పడిలేస్తున్న ఇంగ్లండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వెస్టిండీస్‌తో మంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో తొలిరోజే ఇంగ్లాండ్ పడిలేచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 258/4తో నిలిచింది. క్రీజులో ఒలీ పోప్ (91 బ్యాటింగ్: 142 బంతుల్లో 11x4), జోస్ బట్లర్ (56 బ్యాటింగ్: 120 బంతుల్లో 5x4, 2x6) ఉన్నారు.

ఓపెనర్ డొమినిక్ సిబ్లే (0: 5 బంతుల్లో) తొలి ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన జో రూట్ (17: 59 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యడు. కానీ.. ఓపెనర్ రోర్ బర్న్స్ (57: 147 బంతుల్లో 4x4) క్రీజులో పాతుకుపోయి జట్టు ఇన్నింగ్స్‌ని నడిపించే ప్రయత్నం చేశాడు. 

అతనూ ఔటవగా.. రెండో టెస్టులో సెంచరీ బాదిన బెన్‌స్టోక్స్ (20: 43 బంతుల్లో 2x4) పేలవరీతిలో క్లీన్ బౌల్డయ్యడు. మొత్తంగా.. 47.4 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 122/4తో కష్టాల్లో పడింది. ఆఖరి సెషన్‌లో ఒలి పోప్, జోస్ బట్లర్ గొప్పగా పోరాడారు. ఐదో వికెట్‌కి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ ఇంగ్లాండ్‌ని మళ్లీ మెరుగైన స్థితిలో నిలిపింది. 

వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ (2/56), రోస్టన్ ఛేజ్ (1/24) ఫర్వాలేదనిపించగా.. ఆఖరి సెషన్‌లో విండీస్ బౌలర్లు తేలిపోయారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌‌ ప్రస్తుతం 1-1తో సమమవగా.. విజేత ఎవరనేది ఈ టెస్టు ఫలితం తేల్చనుంది.



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle