అశ్వినీ నాచప్ప సందేశం. ఇంటిని వదలి రావద్దు
06-04-202006-04-2020 16:19:59 IST
Updated On 06-04-2020 16:42:14 ISTUpdated On 06-04-20202020-04-06T10:49:59.461Z06-04-2020 2020-04-06T10:49:42.864Z - 2020-04-06T11:12:14.641Z - 06-04-2020

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధించారు మాజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అశ్వినీ నాచప్ప. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందన్నారు. ఎవరూ లాక్ డౌన్ అతిక్రమించి బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ సూచనలను క్రమం తప్పకుండా పాటించాలని అశ్వినీ నాచప్ప సూచించారు. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. స్టే హోం.. స్టే సేఫ్ అంటూ ఆమె సందేశం ఇచ్చారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో క్రీడాకారులు కూడా తమవంతు సాయం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సోమవారం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోత విధించాలని నిర్ణయించారు. రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్ నిధులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమ వేతనాలను తగ్గించేందుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంగీకరించారు. వేతనాల కోత ద్వారా సమకూరిన నిధులను కన్సాలిడేషన్ ఫండ్‌కు జమ చేస్తామన్నారు. సచిన్, విరాట్, ధోనీ తరహాలోనే బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఉదారతను చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయం చేయడానికి భారీ విరాళం ప్రకటించారు. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి దాతలు చేయూతనివ్వాలని శనివారం ప్రధాని నరేంద్రమోదీ కోరిన విషయం తెలిసిందే. ఇందుకు కొత్తగా పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా తనకు వచ్చే రెండేళ్ల వేతనాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చాడు. కరోనా సహాయక చర్యల్లో, బాధితులకు చేయూత నివ్వడంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, మేరీకోం తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
5 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
7 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
13 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా