newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అర్జున అవార్డు రేసులో ఇషాంత్‌ శర్మ

19-08-202019-08-2020 09:28:41 IST
Updated On 19-08-2020 10:10:03 ISTUpdated On 19-08-20202020-08-19T03:58:41.751Z19-08-2020 2020-08-19T03:58:33.949Z - 2020-08-19T04:40:03.055Z - 19-08-2020

అర్జున అవార్డు రేసులో ఇషాంత్‌ శర్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా సీనియర్ పేసర్‌ ఇషాంత్‌ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇషాంత్‌తో పాటు ఆర్చర్‌ అతాను దాస్‌, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్‌, క్రికెటర్‌ దీపక్‌ హుడా, టెన్నిస్‌ ప్లేయర్‌ దివిజ్‌ శరన్‌ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్‌ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 2016 నుంచి ఈ ఏడాది మే వరకు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం అగ్రస్థానంలో ఉండటంలో ఇషాంత్ సమగ్ర పాత్ర పోషించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలతో కలిసి టెస్టుల్లో భారత పేస్ అటాక్‌లో అతను ప్రధాన సభ్యుడిగా ఉన్నాడు. 31 ఏళ్ల ఇషాంత్‌ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీశాడు.

ప్రముఖ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జత సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు దివిజ్ శరణ్ కూడా సిఫారసు జాబితాలో చేర్చబడ్డారు. రికర్వ్ ఆర్చర్ అతను దాస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మాధురికా పట్కర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వరల్డ్‌ చాంఫియన్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకుపెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

జీవితకాల సాఫల్య అవార్డు ధ్యాన్‌చంద్‌' కోసం కమిటీ పంపించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా బాక్సర్‌ నగిశెట్టి ఉష కూడా ఉన్నారు.వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో రజతం, 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరుసార్లు సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖ లోకో షెడ్‌లో పని చేస్తున్నారు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle