newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అర్జున్ టెండూల్కర్ ఏమి చేస్తున్నాడో తెలుసా..?

15-09-202015-09-2020 15:55:57 IST
2020-09-15T10:25:57.143Z15-09-2020 2020-09-15T10:25:54.162Z - - 19-04-2021

అర్జున్ టెండూల్కర్ ఏమి చేస్తున్నాడో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వైపు అందరి చూపు కూడా ఉంటుందన్నది తెలిసిందే..! అప్పుడప్పుడు అతడు పలు జట్లతో ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి అర్జున్ టెండూల్కర్ ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ మెంటర్ అయినప్పటికీ.. అర్జున్ ను ముంబై ఇండియన్స్ జట్టు వేలంపాటలో కొనుక్కున్నట్లు కానీ.. ఆ తర్వాత అతడిని తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు ముంబై ఇండియన్స్.

కానీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు రాహుల్ చాహర్ పోస్టు చేసిన ఫోటోలో అర్జున్ టెండూల్కర్ కనిపించాడు. ఎంఐ ఆటగాళ్లతో పాటూ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ కూడా ఆ ఫోటోలో ఉన్నాడు. ఇంతకూ అర్జున్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముంబై ఇండియన్స్ తో కలిసి ఏమి చేస్తున్నాడో తెలుసా..? కేవలం ఒక నెట్ బౌలర్ గా సేవలు అందిస్తూ ఉన్నాడు.

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు నెట్‌ బౌలర్లలో ఒకడిగా భారత క్రికెట్‌ అర్జున్‌ టెండూల్కర్‌ వ్యవహరిస్తున్నాడని సమాచారం. నెట్ బౌలర్లను సెలెక్ట్ చేసుకోవడం అన్నది ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం చేతిలో ఉంటుందని బీసీసీఐ అధికారి తెలిపాడు.

అర్జున్ టెండూల్కర్ ఆల్ రౌండర్ గా ఎదగాలని అనుకుంటూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు నెట్స్ లో బౌలింగ్ వేస్తూ వస్తున్నాడు. గతంలో ఇంగ్లాండ్ జట్టుకు కూడా నెట్స్ లో బౌలింగ్ వేశాడు. భారత మహిళల జట్టుకు కూడా అర్జున్ టెండూల్కర్ వరల్డ్ కప్ సమయంలో నెట్ బౌలర్ గా సహాయపడ్డాడు. ఇండియా అండర్-19 టెస్టు జట్టులో సభ్యుడిగా శ్రీలంక మీద మ్యాచ్ ఆడాడు అర్జున్. ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ఐపీఎల్ మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle