అనుష్కతో అడవిలో విరాట్...
05-02-201905-02-2019 18:47:17 IST
Updated On 05-02-2019 18:47:14 ISTUpdated On 05-02-20192019-02-05T13:17:17.115Z05-02-2019 2019-02-05T13:16:33.284Z - 2019-02-05T13:17:14.948Z - 05-02-2019

అనుష్క శర్మతో పెళ్ళయ్యాక విరాట్ కోహ్లీ క్షణకాలం కూడా విరహాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 72ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్టుల్లో భారత్ జట్టుని విజేతగా నిలిపిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లోనూ గెలిపించాడు. ప్రపంచకప్ నేపథ్యంలో సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి అడవుల్లో షికారు చేస్తున్నాడు. అడవిలో వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి 'నా అనుష్క' అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. విరాట్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటో ఎక్కడిదో ఆరాతీస్తున్నారు. అనుష్కతో కలిసి విహారయాత్రకి వెళ్లిన కోహ్లీ సోషల్ మీడియాలో వరుసగా ‘జాలీ ట్రిప్’ ఫొటోలను షేర్ చేస్తున్నాడు. కానీ.. ప్రదేశం పేరు మాత్రం వెల్లడించడంలేదు. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కోహ్లీ స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టుని నడిపించబోతున్నాడు. కాస్త విశ్రాంతి దొరకడంతో కోహ్లీ హ్యాపీగా ఉన్నాడు. భార్య పక్కనే ఉండడంతో ఆ ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.

G. Sathyanarayana Raju
గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
gsnraju@rightfolio.in
040 23600300

సానియా వుయ్ హేట్ యూ.... నెటిజన్ల ఫైర్
21 hours ago

ఆ ఇద్దరి ముందు కోహ్లీ జూజుబీ
12-02-2019

‘కార్తీక్ తప్పు వల్లే భారత్ ఓడింది’
11-02-2019

కోహ్లీకి సమానంగా సింధు
09-02-2019

షమీ ‘ఇంగ్లీష్’కి హోరెత్తిన మైదానం
29-01-2019

కివీస్‌పై హ్యాట్రిక్ కొట్టిన భారత్
28-01-2019

కోహ్లీ గుట్టు విప్పిన చీఫ్ సెలెక్టర్
24-01-2019

15 ఏళ్ళనాటి చరిత్ర తిరగరాసిన షమీ
23-01-2019

పాండ్యా వివాదంపై ది ‘వాల్’
22-01-2019

కోహ్లీ క్లీన్‌స్వీప్... అన్ని అవార్డులూ అతనికే!
22-01-2019
ఇంకా