newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అనుభవజ్ఞులు లేని ధోనీ టీమ్‌‌కి టైటిల్ దక్కదు.. ఐపీఎల్ విజేతపై గవాస్కర్

17-09-202017-09-2020 22:48:13 IST
2020-09-17T17:18:13.606Z17-09-2020 2020-09-17T17:18:11.527Z - - 14-04-2021

అనుభవజ్ఞులు లేని ధోనీ టీమ్‌‌కి టైటిల్ దక్కదు.. ఐపీఎల్ విజేతపై గవాస్కర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జట్టులో యువత లేకపోవడం, అనుభవజ్ఞులు దూరం కావడం కారణంగా ఐపీఎల్ 2020 టైటిల్‌ను గెల్చుకునే అవకాశాలు చెన్నై సూపర్ కింక్స్ జట్టుకు తక్కువేనని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా సురైష్ రైనా, హర్భజన్ జట్టులో లేకపోవడం సీఎస్కేకి పెద్ద దెబ్బ అన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజ్‌లలో సీఎస్కే ఒకటి. ఇప్పటికే ఎమ్ఎస్ ధోనీ నాయకత్వంలో ఈ జట్టు మూడుసార్లు టైటిల్ గెల్చుకుంది. కానీ టోర్నీ ప్రారంభం కాకముందే హర్భజన్, సురేష్ రైనా వంటి నిలకడైన ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకోవడంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లయిందని గవాస్కర్ అంచనా వేశారు.

ఈసారి ముంబై, చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లలో ఎవరికైనా టైటిల్ లభించే అవకాశాలున్నాయని ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాకముందే మాజీలూ, ప్రస్తుత ఆటగాళ్లు జోస్యం చేబుతున్నారు. కానీ చెన్నై జట్టుకు మాత్రం ఈ దఫా టైటిల్ గెల్చి అవకాశాలు అంతగా లేవని గవాల్కర్ పెదవి విరిచారు. అయితే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పిన ధోనికి మాత్రం ఈ ఐపీఎల్‌ లాభదాయకంగా మారుతుందని.. ఎందుకంటే అతనిపై ఒత్తిడి అంతగా ఉండకపోవడమే కారణమని తెలిపాడు. స్పోర్ట్స్‌టాక్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సునీల్‌ గవాస్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'సురేశ్‌ రైనా, హర్బజన్‌ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన చెన్నై జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో ఎంతమేరకు రాణిస్తుందనేది చూడాలి. ఎందుకంటే జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు ఉంటేనే సమతూకంగా ఉంటుందని.. కానీ చెన్నైలో ప్రస్తుతం అది మిస్సయింది. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడం కొంచెం కష్టంగా మారిందని గవాస్కర్ సీఎస్కే జట్టులో సమకూకం లోపించడాన్ని ఎత్తి చూపారు.

అయితే జట్టులో సీనియర్‌ ఆటగాడిగా.. కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్‌ ధోనికి మాత్రం ఐపీఎల్‌ లాభదాయకంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన ధోనికి ఒత్తిడి లేకపోవడం దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంది. ఒక కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపిస్తాడనంలో సందేహం లేదు. అయితే యువ ఆటగాళ్లు ఎంతమేర సహకరిస్తారనేది చూడాలి.' అంటూ గవాస్కర్ పేర్కొన్నారు.

ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌కు గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో చెన్నై జట్టు కేవలం నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది.. మిగతావారిని తనవద్దే ఉంచుకొని డాడీస్‌ ఆర్మీ ట్యాగ్‌గా ముద్రించుకుంది.  రైనా, హర్భజన్‌ గైర్హాజరీలో చెన్నై జట్టులో ధోని, డుప్లెసిస్‌, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఒక బౌలింగ్‌లో జోష్‌ హాజల్‌వుడ్‌, డ్వేన్‌ బ్రేవో, ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ సాంట్నర్‌లు ఉన్నారు. 

కాగా చెన్నై జట్టు  ముంబై ఇండియన్స్‌తో సెప్టెంబర్‌ 19న  తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle