newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అనుకున్నంతా అయింది.. టోక్యో ఒలింపిక్స్ వాయిదా

24-03-202024-03-2020 19:55:22 IST
2020-03-24T14:25:22.550Z24-03-2020 2020-03-24T14:25:10.134Z - - 11-04-2021

అనుకున్నంతా అయింది.. టోక్యో ఒలింపిక్స్ వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులతో దేశాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఐపీఎల్ కూడా వాయిదా పడుతోంది. జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలింపిక్స్ ను వాయిదా వేసింది.

ఒక ఏడాది పాటు ఒలింపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. అయితే ఒక దశలో ఒలంపిక్స్ ను జరపాలని నిర్ణయించింది. అయితే రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఒలింపిక్స్ ను వాయిదా వేయక తప్పలేదు. 

అయితే కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుండటంతో అన్ని దేశాలు షట్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. దీంతో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అన్ని ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏ దేశం నుంచి పార్టిసిపేషన్ ఉండదు. దీంతో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఇంచుమించు ప్రపంచమంతా రిస్క్ లో పడింది.  

ఇది చాలా బాధ క‌ర‌మైన నిర్ణ‌య‌మ‌ని అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ (ఐఓసీ) స‌భ్యుడు డిచ్ పౌండ్ తెలిపారు. వాస్త‌వానికి ఈ టోర్నీ జూలై 24 నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌ర‌గాలి. కరోనాతో జరిగే నష్టాల గురించి చర్చ జరిగింది.  ఇప్ప‌టికే వైర‌స్ చాలా దేశాల‌కు వ్యాప్తి చెంద‌డంతో, టోర్నీని వాయిదా వేయాల‌ని డిమాండ్లు వెల్లువెత్తాయి. కెన‌డా, ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఈ ప్ర‌క‌ట‌న రావ‌డానికి ముందు ఐఓసీ.. జ‌పాన్ ప్ర‌భుత్వంతో సుదీర్ఘంగా చ‌ర్చించింది. అనంత‌రం వాయిదా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle