newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

08-12-201908-12-2019 13:46:00 IST
2019-12-08T08:16:00.467Z08-12-2019 2019-12-08T08:15:54.637Z - - 24-01-2020

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వెస్టిండీస్‌తో ఆడిన గత ఏడు టీ20ల్లోనూ టీమ్‌ఇండియానే గెలుపొందింది. చార్మినార్ సాక్షిగా విండీస్‌ను చెడుగుడాడుకున్న విరాట్ సైన్యం అనంత పద్మనాభుడి సన్నిధిలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది. ఇరు జట్ల మధ్య నేడు తిరువనంతపురంలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్న నేపధ్యంలో భారత్‌కు ఎదురునిలిచి, గెలిచి విండీస్‌ సిరీస్‌ను సమం చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

ఇప్పటికే విండీస్‌పై వరుసగా ఏడు టీ20ల్లో నెగ్గిన కోహ్లీ అండ్ కో.. ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకోవడంతో పాటు 2-0తో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదపూట్టిన టీమ్‌ఇండియా ఇక్కడే సిరీస్ కైవసమైతే.. ముంబై వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించుకోవచ్చని చూస్తున్నది.

మిగిలిన రెండు ఫార్మాట్‌లతో పోల్చుకుంటే.. టీ20 కాస్త భిన్నం. ఇక్కడ ఎక్కువ సమయం ఉండదు. టార్గెట్ ఎంత ఉన్నా.. ఒక బ్యాట్స్‌మెన్ చివరి వరకు నిలిస్తే.. మిగిలిన వారిపై ఒత్తిడి తగ్గుతుంది’సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ అన్న మాటలివి. శుక్రవారం హైదరాబాద్ మ్యాచ్‌లో విరాట్ అచ్చంగా ఇదే ప్లాన్ అనుసరించాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విఫలమైనా.. ముందుండి జట్టును నడిపించాడు.

అతడికి మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ చక్కటి సహకారం అందించాడు. పొట్టి ఫార్మాట్‌లో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు ఉన్న రాహుల్ ఆరంభంలో చక్కటి షాట్లు ఆడటంతో కోహ్లీపై ఒత్తిడి తగ్గింది. లక్షం పెద్దదే అయినా.. ఎక్కడా వెనక్కి తగ్గని కోహ్లీ సాధించాల్సిన రన్‌రేట్‌కు అనుగుణంగా బ్యాటింగ్ సాగించాడు. ఒక్కసారి టాప్ గేర్‌లోకి వెళ్లాక ఇక విరాట్‌కు ఎదురులేకుండా పోయింది. బంతి ఎక్కడపడ్డా దాన్ని స్టాండ్స్‌లోకి పంపించడమే పనిగా పెట్టుకున్న కెప్టెన్.. చూస్తుండగానే మ్యాచ్‌ను కరీబియన్ల నుంచి లాక్కున్నాడు.

అయితే టార్గెట్ ఛేజింగ్‌లో విశేషంగా ఆకట్టుకుంటున్న భారత్.. మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా ఇదే జోరు కనబరిస్తే ఇక తిరుగుండదు. రిషబ్ పంత్ మరోసారి పేలవ షాట్ కొట్టి ఔట్ కావడం నిరాశ పరిచింది. పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని అయ్యర్, శివం ఈ మ్యాచ్‌లో సత్తాచాటాలని చూస్తున్నారు. లోకల్ స్టార్ సంజూ శాంసన్‌కు తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే.

మనవాళ్లు ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేనంత చెత్త ప్రదర్శన కనబర్చారు. చేతుల్లో పడ్డ బంతులను వదిలేయడం.. గాల్లోకి లేచిన బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం ఇలాంటి తప్పిదాల వల్ల ప్రత్యర్థి భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఇచ్చారు. శుక్రవారం పోరులో టీమ్‌ఇండియా ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ప్రత్యర్థి స్కోరు 200 దాటింది. ప్రాక్టీస్‌లో దీనిపై దృష్టిపెడతామంటున్న భారత్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు భారత బౌలింగ్ కూడా సాధారణంగా కనిపించింది.

దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లను బెంబేలేత్తించిన దీపక్ చాహర్ భారీగా పరుగులు (54) ఇచ్చుకుంటే.. సుదీర్ఘ విరామం అనంతరం బరిలో దిగిన భువనేశ్వర్ కుమార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. చాహల్, జడేజా కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. ‘బ్రేక్ త్రూ’లు ఇప్పిస్తాడనుకున్న వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోయాడు. అతడు ఆడిన గత ఆరు టీ20ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం సుందర్‌ను పక్కనపెట్టి కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా చూడాలి. అయితే విన్నింగ్ కూర్పును మార్చడానికి ఇష్టపడని కోహ్లీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాపూక్కువ.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle