అదృష్టం అంటే ఎలా ఉంటుందో ఆరోజే సచిన్‌కు బాగా అర్థమైంది.. ఆశిష్ నెహ్రా
11-08-202011-08-2020 15:12:56 IST
2020-08-11T09:42:56.632Z11-08-2020 2020-08-11T09:42:49.298Z - - 19-04-2021

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ వంటి బలమైన ప్రత్యర్థితో ఆడుతున్నప్పుడు ఒక బ్యాట్స్‌మన్‌కు ఒకే మ్యాచ్‌లో నాలుగసార్లు జీవన దానం లభించిందంటే ఏ ఆటగాడికైనా అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విషయంలో ఇదీ ఇంకా ఎక్కువగా వర్తిస్తుందని టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా వెల్లడించాడు. ప్రపంచ కప్‌లో అందులోనూ పాక్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు నరాలు తెగే ఉత్కంఠ సమయంలో సచిన్ వంటి మేటి ఆటగాడికి నాలుగు సార్లు లైఫ్ లభించడం అంటే సామాన్య విషయం కాదని నెహ్రా వ్యాఖ్యానించాడు. అందుకే ఆరోజు సచిన్ నక్కను తొక్కి వచ్చాడంటే అతిశయోక్తి కాదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. భారత్‌కు రెండో సారి ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన సంవత్సరం 2011. ఆ ఏడు ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అదృష్టం భలే కలిసొచ్చిందంటూ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడినా.. నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఆనాటి మ్యాచ్ విషయాలను నెహ్రా మరోసారి పంచుకున్నాడు. 'నిజంగా ఆరోజు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ నక్కతోక తొక్కివచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే అతను చేసిన 85 పరుగులు.. నాలుగు సార్లు పాక్ ఫీల్డర్లు క్యాచ్‌లు విడవడం ద్వారా సాధించాడు. అదృష్టం అంటే ఎలా ఉంటుందో బహుశా సచిన్‌కు ఆరోజు తెలిసి ఉంటుంది. సచిన్‌కు నెర్వెస్ నైంటీస్ అనే ఫోబియా ఉండేది.. కానీ పాక్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆ ఫోబియా కనిపించలేదు.. కానీ ఒత్తిడి కనిపించింది. సచిన్ నాలుగుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే ఆరోజు అదృష్టం అతని వెంట ఉంది. ఇక ప్రపంచకప్‌లో ఒక కీలక మ్యాచ్‌లో ఒత్తిడి ఉండడం సహజం.. అది ఇండియా-పాక్, ఇండియా- ఇంగ్లండ్ ఏ మ్యాచ్ అయినా కావొచ్చు.. మేం సెమీఫైనల్ చేరుకొని ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించాం 'అంటూ ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. ఇక పాక్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 260 పరుగులు చేసింది. సచిన్ ఈ మ్యాచ్‌లో 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ సచిన్ వరుసగా 25,45,70,81 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. మిస్బా, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్‌లు నాలుగుసార్లు క్యాచ్‌లు జారవిడిచారు. ఆ తర్వాత భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ జట్టు 231 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. దీంతో ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ శ్రీలంకపై ఘనవిజయం సాధించి 28 సంవత్సరాల నిరీక్షణ తర్వాత సొంతగడ్డపై రెండోసారి సగర్వంగా ప్రపంచకప్‌ను అందుకుంది. 2011 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్ ఉమర్ గుల్ బౌలింగులో ఒక ఓవర్లో నాలుగు ఫోర్లు బాది వీరేంద్ర సెహ్వాగ్ ఫామ్ లో ఉన్న్పప్పుడు సునాయాసంగం 340 లేక 350 పరుగులు సాధిస్తామని భావించాం కానీ 260లోపు పరుగులే చేశాం. అదే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో పాక్ మంచి ప్రారంభాన్ని అందించిందని, కానీ టీమిండియా సమిష్టి కృషి వల్లే 257 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలువరించి ఫైనల్లో అడుగుపెట్టామని ఆశిష్ నెహ్రా తెలిపాడు.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
3 hours ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
10 hours ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
21 hours ago

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా