అది వ్యూహం కాదట.. నిజం చెప్పిన ధోని
23-09-202023-09-2020 13:40:32 IST
2020-09-23T08:10:32.029Z23-09-2020 2020-09-23T08:10:09.119Z - - 12-04-2021

మహేంద్ర సింగ్ ధోని.. అద్భుత పినిషర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు దిగి పరుగుల వరద పారించగలడు. చేయాల్సిన పరుగులు ఎన్ని ఉన్నా.. క్రీజులో ధోని ఉంటే అభిమానులకు భరోసా. మరీ అలాంటి భరోసా ఇచ్చే ధోనికి ఏమైంది..? మునపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు అనేది నిజం..? ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై ఆడిన రెండు మ్యాచ్‌లో మహీ లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగాడు. యువ ఆల్‌రౌండర్ సామ్‌కరణ్, రవీంద్రజడేజాలను తన కంటే ముందుగా పంపించాడు. చాలా మంది దీనిని ధోని అద్భుత వ్యూహాంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా.. ధోని వ్యూహాలలో తేడా రాదని నిరూపించాడు అని పలువురు మాజీలు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఓటమి తరువాత తాను ఎందుకు లోయర్ ఆర్డర్లో వస్తున్నాననే విషయాన్ని చెప్పాడు మహీ. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ధోని సేన 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోని క్రీజులో ఉన్నప్పటికి చివరి వరకు భారీ షాట్లు ఆడలేదు. ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టినా.. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. దీనిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని స్పందించాడు. 217 పరుగుల లక్ష్యాన్ని చేదించాలంటే శుభారంభం అవసరమన్నాడు. అయితే.. తమకు అది దక్కలేదన్నాడు. స్టీవ్‌స్మిత్, సంజు శాంసన్ అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. మా బౌలర్లు ఎక్కువగా పుల్ లెంగ్త్ బంతులు విసిరారు. తొలి ఇన్నింగ్స్ చూసాకా.. బౌలర్లకు ఎలా బౌలింగ్ చేయాలో అవగాహన వచ్చిందని.. రాజస్థాన్ బౌలర్లు దానిని సద్వినియోగం చేసుకున్నారన్నాడు. రాజస్థాన్‌ను 200స్కోరుకే పరిమితం చేస్తే మ్యాచ్ మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. 14 రోజుల క్వారంటైన్ తన సన్నద్దతపై ప్రభావం చూపించిందని మహేంద్రుడు తెలిపాడు. సాధనకు అవసరమైన సమయం దొరకలేదని పేర్కొన్నాడు. అందులోనూ ఏడాది కాలం బ్యాటు పట్టుకోకపోవడంతో లోయర్ ఆర్డర్లో వస్తున్నానని నిజం చెప్పేశాడు. చెన్నై శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మందికి కరోనా సోకడంతో ఎక్కువ రోజులు క్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో తొలి మ్యాచ్ కాకుండా మరికొన్ని రోజుల తరువాత ఆడేందుకు సీఎస్కేకు బీసీసీఐ అవకాశం ఇచ్చిందని.. కానీ.. ధోనినే ఆ ప్రతిపాదనను తిరస్కరించాడని అప్పట్లో వార్తలు వినిపించాయి.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
10 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
20 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
19 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా