newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ

30-05-202030-05-2020 15:58:20 IST
Updated On 30-05-2020 17:11:23 ISTUpdated On 30-05-20202020-05-30T10:28:20.065Z30-05-2020 2020-05-30T10:28:17.235Z - 2020-05-30T11:41:23.579Z - 30-05-2020

అది విషాదాన్ని దాచుకున్న నవ్వు.. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై సంగక్కర వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వన్డే ప్రపంచ కప్ 2011. టీమిండియా 28 సంవత్సరాల తర్వాత రెండోసారి ప్రపంచ కప్ గెల్చుకున్న క్షణాలు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగానే ఉంటున్నాయి. లక్ష్యఛేదనలో భాగంగా చివరి ఓవర్ తొలి బంతిని భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సిక్సర్ బాదిన ఘటన 120 కోట్లమంది భారతీయులను పరమానందంలో ముంచెత్తింది. మైదానంలో ధోనీ, అవతలి ఎండ్‌లో యువరాజ్ సింగ్ ఆ క్షణంలో ఒకరినొకరు కౌగలించుకుని ఆనందంలో మునిగి తేలుతుండగా వికెట్ల వెనకాల నిలుచుని నవ్వుతూ ఉండిపోయిన శ్రీలంక  జట్టు వికెట్ కీపర్ కుమార సంగక్కరను కూడా ఎవరూ మర్చిపోలేరు. దేశం ఆశలు కూలిపోయి విజయానికి దూరమైన ఆ క్షణం సంగక్కర చిరునవ్వు అతటి క్రీడా స్పూర్తికి చిహ్నం కావచ్చు కానీ ఆ నవ్వు.. విజయం అంచుల దాకా వచ్చి పరాజయాన్ని చవిచూసిన విషాదాన్ని దాచిన నవ్వుగా సంగక్కర ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టాడు.

2011లో వన్డే ప్రపంచకప్‌ రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్ వేసిన లంక బౌలర్ కులశేఖర్‌ బౌలింగ్‌లో ధోని సిక్సర్‌ కొట్టిన వెంటనే యువరాజ్ సింగ్ ఆనందంతో ధోనిని హత్తుకునే ఉద్వేగభరిత దృశ్యాలు మనందరికీ గుర్తుండే ఉంటాయి. కానీ యువీ, ధోనిలు సంబరాలు జరుపుకుంటే అక్కడే వికెట్ల వెనకాల ఉన్న కుమార సంగక్కర చిరునవ్వును చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించారు. క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ, ఓటమిని అంగీకరిస్తూ గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే అతడి ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. దీనికి లంక అభిమానులతో సహా, యావత్‌ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్‌ చేసింది. ఈ క్రమంలో అలాంటి బాధాకర సమయంలో కూడా తన ముఖంపై చిరునవ్వుకు గల కారణాలను సంగక్కర తాజాగా వెల్లడించారు. 

ఆ ఫైనల్ మ్యాచ్ నా అంతర్జాతీయ కెరీర్‌లో ఆడిన అతిపెద్ద మ్యాచ్. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తృటిలో విజయానికి దూరమయ్యాం. కానీ అంతభాధలో కూడా పరాజయాన్ని మరీ అంత భారంగా తీసుకోకూడదన్న ఆలోచనే నాలో ఉండింది. అందుకే తట్టుకోలేని ఓటమి భారంలో కూడా నాలో రగులుతున్న విషాదాన్ని అణుచుకుని పైకి చిరునవ్వు నవ్వాను. భారత జట్టు విజయాన్ని అభినందిస్తున్నట్లుగా పైకి కనిపించినప్పటికీ ఆనాటి నా నవ్వు విషాదాన్ని లోపల దాచుకుని పైకి మాత్రం కనపర్చిన నవ్వు అంటూ సంగక్కర ఇన్‌స్టాగ్రామ్ సీరీస్ తాజా ఎపిసోడ్‌లో టీమిండియా బౌలర్ అశ్విన్‌తో సంభాషణ క్రమంలో వివరించాడు.

‘ప్రపంచకప్‌-2011 సమయాని​కి 30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను. మేము ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. కొన్ని పరిస్థితులు మమ్మల్ని కిందికి నెట్టేశాయి. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఇలా అనేక సమస్యలు వచ్చాయి. కానీ శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే స్థితిస్థాపకత. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వ స్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్‌ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాము. గెలుపు కోసమే బరిలోకి దిగుతాం, రెండు కోట్ల మంది ప్రజల ముఖాలపై చిరునవ్వు కోసం ఆడతాం, పోరాడుతాం. గెలుపోటములు సహజం. కానీ ఓటమిని జీర్ణించుకొని తరువాతి మ్యాచ్‌ కోసం త్వరగా సన్నద్దమవుతాం.

1996 తర్వాత మరోసారి ప్రపంచకప్‌ గెలవడానికి 2007, 2011లో అదేవిధంగా 2009, 2012 (టీ20 ప్రపంచకప్‌)లో అవకాశం వచ్చింది. కానీ ఫైనల్‌ మెట్టుపై ఓడిపోయాం. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌ మమ్మల్ని ఎక్కువగా బాధించింది. మంచి టీం, మంచి స్కోర్‌ సాధించాం, ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాం అయినా ఓడిపోయాం. అయితే కొన్ని సార్లు ఇలాంటివి సంభవిస్తాయి. ఇప్పుడు ఓడిపోయాం. అయితే ఏడుస్తూ కూర్చొని ఉంటామా లేక వచ్చే ప్రపంచకప్‌ కోసం సన్నద్దం కావాలా మా ఆలోచన కూడా అంతే. మా ఆటగాళ్లకు కూడా ఎప్పుడూ ఒకటి చెబుతుంటా. ఎక్కువ ఎమోషన్‌గా ఉండకూడదని, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్‌గా‌ ఉంటే తమను తాము నియంత్రించుకోలేరు’ అంటూ సంగక్కర వివరించారు. 

1996 తర్వాత 2 కోట్లమంది శ్రీలంక ప్రజలు భారీ ఎత్తున మా జట్టుపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేశామే అనే పెనువిషాదాన్ని బలవంతంగా దిగమింగుకుని మరీ పైకి నవ్వాను. కానీ కొన్ని సార్లు అలాగే జరుగుతుంది. విజయాన్ని కానీ పరాజయాన్ని కానీ అర్థం చేసుకునేందుకు గొప్ప మార్గం ఏమిటంటే జీవితం తీరే అంత అని గ్రహించడమే అని సంగక్కర జీవన తాత్వికతను వివరించాడు. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   8 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle