newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అది టీం ఇండియా సొంతం.. బుమ్రా రికార్డు

30-01-202030-01-2020 16:53:01 IST
Updated On 30-01-2020 17:11:22 ISTUpdated On 30-01-20202020-01-30T11:23:01.898Z30-01-2020 2020-01-30T11:22:10.851Z - 2020-01-30T11:41:22.542Z - 30-01-2020

అది టీం ఇండియా సొంతం.. బుమ్రా రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 3 మ్యాచ్‌లు గెలిచి సిరీస్ స్వంతం చేసుకున్న టీంఇండియా అరుదైన రికార్డులు నెలకొల్పింది.  టీ20 చరిత్రలో సూపర్‌ ఓవర్ రికార్డును తిరగరాయడం విశేషం.

సూపర్‌ ఓవర్‌లో ఛేజింగ్‌ చేస్తూ వికెట్‌ నష్టపోకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా టీం ఇండియా కొత్త రికార్డు సాధించింది. ఇంతకుముందు వెస్టిండీస్‌ పేరిట వున్న అరుదైన రికార్డును కోహ్లీ సేన బద్దలు కొట్టింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ సూపర్‌ ఓవర్‌ ఛేజింగ్‌లో వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు సాధించింది.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా సూపర్‌ ఓవర్‌లో ముందుగా కివీస్‌ వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌ తరఫున టిమ్‌ సౌతీ ఐదుసార్లు సూపర్‌ ఓవర్‌ వేయగా, నాలుగుసార్లు ఓడిపోయారు. అంతేకాదు జస్ ప్రీత్ బుమ్రా కూడా రికార్డులు తిరగ రాశాడు.

అతని ప్రతిభకు టీ20 మ్యాచ్ లలో సూపర్ ఓవర్ ని మెచ్చుతునకగా చెబుతున్నారు. ఐపీఎల్, అంతర్జాతీయ టి20ల్లో కలిపి జస్‌ప్రీత్‌ బుమ్రా మూడుసార్లు సూపర్‌ ఓవర్‌ వేశాడు. అన్నిసార్లూ అతని జట్టే విజయం సాధించింది. ఐపీఎల్‌లో 2017లో గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌లో... 2019లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేశాడు. తాజాగా వేసిన సూపర్ ఓవర్ కూడా టీంఇండియాకు కలిసి వచ్చింది. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   12 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   17 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle