newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మ్యాచ్.. 2014 అడిలైడ్‌ టెస్టుపై కోహ్లి వ్యాఖ్య

01-07-202001-07-2020 08:12:07 IST
Updated On 01-07-2020 10:10:08 ISTUpdated On 01-07-20202020-07-01T02:42:07.862Z01-07-2020 2020-07-01T02:42:04.674Z - 2020-07-01T04:40:08.252Z - 01-07-2020

అది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మ్యాచ్.. 2014 అడిలైడ్‌ టెస్టుపై కోహ్లి వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత జట్టు 2018–19 సీజన్‌లో తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అయితే అంతకు నాలుగేళ్ల క్రితమే ఒక టెస్టులో అద్భుత విజయానికి చేరువగా వచ్చి త్రుటిలో ఓటమి పాలైంది. నాటి మ్యాచ్‌లో తమ ఆటతీరు జట్టులో ఆత్మవిశ్వాసం నింపిందని, గట్టిగా ప్రయత్నిస్తే ఆస్ట్రేలియాలో విజయం సాధించగలమనే నమ్మకాన్ని పెంచిందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. 2014–15 సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టును గుర్తు చేసుకుంటూ అతను ఈ వ్యాఖ్య చేశాడు. 

ధోని గైర్హాజరులో ఈ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ 315 పరుగులకు ఆలౌటై 48 పరుగుల తేడాతో ఓడింది. 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 141 పరుగులు చేసిన కోహ్లి గెలుపు కోసం మరో 60 పరుగులు చేయాల్సిన దశలో నిష్క్రమించాడు. ఆ తర్వాత జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ను కోహ్లి సోషల్‌ మీడియాలో గుర్తు చేసుకున్నాడు. 

‘ఈ రోజు మన టెస్టు జట్టు ఇంత మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ఎంతో ప్రత్యేకమైన, కీలకమైన అడిలైడ్‌æ 2014 టెస్టు మ్యాచ్‌ జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇరు జట్లూ ఎంతో భావోద్వేగంతో ఆ మ్యాచ్‌ ఆడాయి (మైదానంలో బంతి తగిలి ఆసీస్‌ ఆటగాడు ఫిల్‌ హ్యూజెస్‌ అనూహ్యంగా మృతి చెందిన కొద్ది రోజులకు ఈ టెస్టు జరిగింది). ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి దక్కింది. మేం గెలుపు తీరం చేరలేకపోయినా చేరువగా మాత్రం రాగలిగాం. మేం పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెడితే ఏదైనా సాధ్యమే అని ఆ మ్యాచ్‌ నిరూపించింది. ఎవరూ అంతకుముందు ఊహించని విధంగా దాదాపు గెలిచినంత పని చేశాం. మేమెంతో అంకితభావంతో ఆడాం. టెస్టు జట్టుగా ఎదిగే క్రమంలో ఈ మ్యాచ్‌ ఎప్పటికీ ఒక మైలురాయిగా మిగిలిపోతుంది’ అని కోహ్లి ట్వీట్‌ చేశాడు.

భారత జట్టు ప్రయాణంలో ఆనాడు జరిగిన అడిలైడ్ టెస్టు ఒక మైలురాయి అనే చెప్పాలి. ఆనాటి ఆ అనుభవంతోనే టెస్టు మ్యాచుల్లో టీమిండియా ఇవాల్టి స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాలనూ భావోద్వేగంలో ముంచెత్తిన ఆనాటి మ్యాచ్ ప్రేక్షకులకు కూడా చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది అని కోహ్లీ చెప్పుకొచ్చాడు

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   33 minutes ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   4 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   8 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   20 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle