newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అత్యుత్తమ ఫినిషర్ ఎవరా.. ఇంకెవరు అంటున్న మిల్లర్

16-09-202016-09-2020 08:43:57 IST
2020-09-16T03:13:57.239Z16-09-2020 2020-09-16T03:13:53.499Z - - 19-04-2021

అత్యుత్తమ ఫినిషర్ ఎవరా.. ఇంకెవరు అంటున్న మిల్లర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 13వ సీజన్ ఇంకా మొదలు కాలేదు. వివిధ జట్ల ఆటగాళ్లు అత్యంత జాగ్రత్తలతో కోవిడ్ బారిన పడకుండా ఉంటూ శిక్షణ తీసుకుంటున్నారు. కాగా ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ ఎవరనే చర్చ తాజాగా చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ దానికి తిరుగులేని సమాధానం ఇచ్చాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ అతడే బెస్ట్ ఫినిషర్ అనేశాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆటను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ఆ ఒక్కడికే సాధ్యమని తేల్చి పడేశాడు.

ఇంతకూ ఎవరా అద్భుతమైన ఫినిషర్.. అతడే ధోనీ..  మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించినా ఆయన కెప్టెన్సీని మాత్రం ఇప్పటికీ అందరు ప్రశంసిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ధోని నైపుణ్యాలను గుర్తు చేస్తు ప్రశంసలు కురిపించాడు. ఓ మీడియా చానెల్‌లో మిల్లర్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై చెప్పినప్పటికి ఐపీఎల్‌ 2020లో ఆయన మెరుపులను ధోని అభిమానులు, క్రికెట్‌ను ఇష్టపడే వారు  చూడవచ్చని తెలిపారు. 

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికి ధోనియే బెస్ట్‌ ఫినిషర్‌ అని పేర్కొన్నాడు. గ్రౌండ్‌లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు క్రికెటర్లందరికి ఆదర్శమన్నాడు. ఎటువంటి పరిస్థితినైనా తన అధీనంలోకి తెచ్చుకోవడం ఆయనకే సాధ్యమని అన్నారు. ఎంత ఒత్తిడి ఉన్న ప్రశాంతంగా ఎదుర్కొనే తీరు ధోనిని దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేర్చిందని అన్నాడు. ఒత్తిడి సందర్భాల్లో ఆయన ప్రదర్శించే నైపుణ్యాలు తనకు చాలా ఇష్టమని తెలిపాడు. 

మిల్లర్‌కు ధోని ఆటతీరు, వ్యక్తిత్వం అంటే విపరీతమైన ఇష్టం. గత ఐపీఎల్‌లో మిల్లర్ కింగ్స్‌ లెవన్‌ పంజాబ్ తరపున ఆడాడు. ప్రస్తుత ఐపీఎల్‌2020లో డేవిడ్ మిల్లర్ రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలో దిగనున్నాడు. సౌతాఫ్రికా ఆటగాడైన డేవిడ్‌ మిల్లర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

బ్యాట్స్‌మన్‌గా ధోనీ మెలకువలు నేర్చుకుని పాటించడం కంటే ఎంస్ ధోనీ చేజింగ్‌లో తన ఆటను మలుచుకునే తీరు ఎప్పటికీ నాకు ఆదర్శమే అన్నాడు మిల్లర్.. సరిగ్గా ధోనీలాగే ఆటను ముగించాలన్నది తన ఆశయమని పేర్కొన్నాడు. ఎవరెన్ని చెప్పినా ధోనీ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకరు అనడంలో సందేహమే లేదు. అనేక సార్లు ధోనీ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అతడి ఆటను ఎంతగానో ఆస్వాదిస్తాను అని మిల్లర్ ప్రశంసించాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle