అక్కడ ఆడటం అంత సులువు కాదు: రోహిత్
06-08-202006-08-2020 13:29:39 IST
Updated On 06-08-2020 14:43:19 ISTUpdated On 06-08-20202020-08-06T07:59:39.408Z06-08-2020 2020-08-06T07:50:30.010Z - 2020-08-06T09:13:19.127Z - 06-08-2020

యూఏఈలోని అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం సవాలే అని టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆగస్టు 20 తర్వాత టోర్నీలోని ఎనిమిది జట్లు యూఏఈకి వెళ్లనున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ 53 రోజుల పాటు జరగనుండగా.. మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. బీసీసీఐ ఈ మెగా టోర్నీని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తున్నారు.యూఏఈలో లీగ్ ఆడనుండటంపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు. యూఏఈలోని పిచ్‌లు కొంచెం నెమ్మదిగా ఉంటాయి. అయితే పరిస్థితులు మాత్రం చాలా వరకు భారత్‌కు దగ్గరగానే ఉంటాయి. కానీ అక్కడి అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడం మాత్రం సవాలే అని అన్నారు. ఉక్కపోత అధికంగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని ఏవో ప్రణాళికలు వేసుకుంటే.. మైదానంలోకి వెళ్లేసరికి అంతా మారిపోవచ్చు అని హిట్‌మ్యాన్ అన్నాడు. యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యమని రోహిత్ శర్మ అన్నాడు.జట్టులోని కొందరు ఇంతకుముందు ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచులు ఆడలేదని చెప్పాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ నాలుగు టైటిళ్లు అందించాడు. ఐపీఎల్ కోసం ఇంకొన్ని రోజుల్లోనే సన్నద్ధత మొదలుపెట్టనున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు. ఇంకో వారంలో నేను వ్యాయామం చేసే జిమ్ ప్రారంభం అవుతుంది. శరీర దృఢత్వ కసరత్తులు చేస్తా. ఐపీఎల్ ముందు ప్రాక్టీస్ విషయంలో ఏం హడావుడి పడాల్సిన పనిలేదు. అందరికి కావాల్సినంత సమయం ఉంది. ఆట కోసం నెమ్మదిగా సన్నద్ధమవ్వొచ్చు. నా కెరీర్లో బ్యాట్ పట్టకుండా తీసుకున్న అతి పెద్ద విరామం ఇది. నా శరీరం మెరుగైన స్థితిలోనే ఉందనుకుంటున్నా. గతంలో కంటే బలవంతుడినైనట్లు అనిపిస్తోంది. మనసు కూడా విశ్రాంతి పొందింది అని రోహిత్ పేర్కొన్నాడు.కుటుంబం ప్రాధాన్యమేంటో నాకు గతంలో కంటే ఇప్పుడు బాగా తెలిసొచ్చింది. మ్యాచుల కోసం నేను సంవత్సరంలో ఎక్కువగా ఇంట్లో ఉండను. వారు నా కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇంట్లో ఉన్న కొద్దిసమయంలోనే ఆనందంగా ఉండాలి. కానీ నా కూతురితో గత కొన్ని నెలల సమయాన్ని ఆస్వాదించా. సమైరా ఇప్పుడే పెరుగుతోంది. ఆమె జీవితంలోని ఈ సంవత్సరాలను నేను మిస్ అవ్వకూడదనుకుంటున్నా. సమైరాతో ఎక్కువ సమయం గడపడం, ఆమెతో ఆడుకోవడం, ఆమెను నిద్రపుచ్చడం స్వచ్ఛమైన ఆనందం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.తన కెప్టెన్సీ శైలిల గురించి రోహిత్ శర్మ స్పందిస్తూ... కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టులో అందరికంటే తక్కువ ప్రాధాన్యమున్న వ్యక్తి మనమే అని భావించాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతా అని రోహిత్ చెప్పుకొచ్చారు. కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా కనిపించడం అనుకుని చేసేది కాదు. కోపమొచ్చినా సహచరులపై చూపించకూడదు. భావోద్వేగాల్ని దాచుకోవడం ముఖ్యమైన విషయం అన్నాడు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
14 hours ago

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ
15-04-2021

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
15-04-2021

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
15-04-2021

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
14-04-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021
ఇంకా