newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అక్కడే కోహ్లీ ఎందుకు చతికిలబడుతున్నట్లు.. శివరామకృష్ణన్

24-06-202024-06-2020 09:43:20 IST
Updated On 24-06-2020 10:38:42 ISTUpdated On 24-06-20202020-06-24T04:13:20.928Z24-06-2020 2020-06-24T04:12:46.110Z - 2020-06-24T05:08:42.849Z - 24-06-2020

అక్కడే కోహ్లీ ఎందుకు చతికిలబడుతున్నట్లు.. శివరామకృష్ణన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ధోనీ జట్టులో ఉంటే కోహ్లీ విజయాల రికార్డు ఒకరకంగా, ధోనీ జట్టులో లేకుంటే కెప్టెన్‌గా కోహ్లీ విజయాల రికార్డు మరో రకంగా ఉంటోందన్నది జగమెరిగిన సత్యమే. టోర్నీల్లో, మామూలు మ్యాచ్‌లలో కోహ్లీ జట్టు విరగదీసినా, కీలకమైన మ్యాచ్‌ల‌లో విరాట్ అటు బ్యాట్స్‌మన్‌గా ఇటు కెప్టెన్‌గా చతికిలపడుతుండటం అందరికీ తెలిసిన విషయమే. ధోనీతో కూడిన కోహ్లీ, ధోని లేని జట్టులో కోహ్లీ మధ్య చాలా వ్యత్యాసముంటోందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేట‌ర్ లక్ష్మణ్‌‌ శివరామకృష్ణన్‌ చెబుతున్నారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత ఆటతీరు, నాయకత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేట‌ర్ లక్ష్మణ్‌‌ శివరామకృష్ణన్‌ తెలిపారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా మాజీ సారథి(కెప్టెన్‌)‌ ఎంఎస్‌ ధోనితో కోహ్లి అనేక మ్యాచ్‌లు ఆడటం వల్ల వైవిధ్యమైన నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడని అన్నారు. 

అయితే కోహ్లి, ధోని కెప్టెన్సీలు మాత్రం విభిన్నమని విశ్లేషించారు. కోహ్లి తుది జట్టులో అనేక మార్పులు చేస్తాడని, ధోని మాత్రం మార్పులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడని వెల్లడించారు. కాగా పిచ్‌లను బట్టి కోహ్లి ఆటగాళ్లను ఎంపిక చేస్తాడని, ఉన్నత ప్రమాణాలు, వైవిధ్యంతో  బౌలింగ్‌ చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తాడని తెలిపారు. కాగా నైపుణ్యం కలిగిన బౌలర్లతోనే కోహ్లి అధిక విజయాలు సాధిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. 

అయితే ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోని అని పేర్కొన్నాడు. ముఖ్యమైన ఐసీసీ టోర్నీలు కోహ్లి సాధించకపోవడంపై ఆయన స్పందిస్తూ.. ఎక్కువ శాతం సెమీఫైనల్‌ వరకు  విజయాలు సాధిస్తున్నాడని, కానీ సెమీఫైనల్‌లో అతనికి దురదృష్టం వెంటాడుతోందని తెలిపారు. 

కానీ గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్‌లలో స్థిరమైన ఆటతీరును టీమిండియా ప్రదర్శిస్తోందని కొనియాడారు. అయితే కొన్ని మ్యాచ్‌లలో వివిధ కారణాల వల్ల ధోని జట్టులో లేకపోవడంతో కోహ్లి అద్భుత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని అన్నారు. కాగా ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారని లక్ష్మణ్‌‌ శివరామకృష్ణన్ పేర్కొన్నారు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రూపొందాడు అంటే సందేహించాల్సిన పనేలేదు. ఇంతవరకు 86 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 7240 పరుగులు చేశాడు. 248 వన్డేల్లో 11,867 పరుగులు చేశాడు ఇక 82 టీ20లు ఆడి 2794 పరుగులు చేశాడు. 

ఢిల్లీలో పుట్టిన ఈ దిగ్గజ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసి సచిన్ (100), రికీ పాంటింగ్ (71)ల తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ వరకూ అప్రతిహత విజయాలతో వచ్చి కూడా ఒత్తిడి భరించలేక స్వల్ప స్కోరు కూడా నిలబెట్టుకోలేక టీమిండియా కప్పును చేజార్చుకోవడం వెనుకు కోహ్లీ దురదృష్టం కూడా కారణం కావచ్చని శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు.

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   an hour ago


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   2 hours ago


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   5 hours ago


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   9 hours ago


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   a day ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14-04-2021


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   14-04-2021


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle