అంపైర్ తో వాగ్వాదం... 100శాతం మ్యాచ్ ఫీజు కోత
08-01-202008-01-2020 16:40:43 IST
2020-01-08T11:10:43.646Z08-01-2020 2020-01-08T11:10:41.618Z - - 20-04-2021

రంజీ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో గొడవపడిన యువ క్రికెటర్ శుభమన్ గిల్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. మ్యాచ్ 10 నిమిషాలు ఆగిపోవడానికి కారణమైన గిల్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పడింది. అసలేం జరిగిందంటే.... ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య గత శుక్రవారం రంజీ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆరంభంలోనే శుభమన్ గిల్ వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే అంపైర్ ఔటివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శుభమన్ గిల్ క్రీజు వదలకపోవడమే కాకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. క్రికెట్లో ఆ అంపైర్‌కి అదే తొలి మ్యాచ్ కావడంతో కంగారుపడిన అతను తన ఔట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అంపైర్ నిర్ణయంతో ఢిల్లీ క్రికెట్ టీమ్ నిరసన వ్యక్తం చేసింది. తాము ఈ మ్యాచ్‌లో ఆడబోమంటూ మైదానం వెలుపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో స్వయంగా మ్యాచ్ రిఫరీ కలగజేసుకుని ఢిల్లీ టీమ్ మళ్లీ మ్యాచ్ ఆడేలా ఒప్పించాడు. ఈ క్రమంలో దాదాపు 10 నిమిషాలు మ్యాచ్ ఆగిపోయింది. ఈ ఘటన పై విచారణ జరిపిన రిఫరీ పంజాబ్ ఓపెనర్ శుభమన్ గిల్ క్రికెట్ నియమావళిని ఉల్లంఘించాడని తేల్చాడు. అతని మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధించాడు.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
15 hours ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
a day ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
18-04-2021

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా