newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అందుకే ఐపీఎల్‌లో ఆడలేదు.. అలాగని బాధా లేదు..

09-09-202009-09-2020 09:24:19 IST
2020-09-09T03:54:19.167Z09-09-2020 2020-09-09T02:26:23.641Z - - 22-04-2021

అందుకే ఐపీఎల్‌లో ఆడలేదు.. అలాగని బాధా లేదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ క్రికెట్ రంగంలోనే అత్యధికంగా కాసుల పంట పండిస్తున్న ఐపీఎల్‌లో ఆడాలన్నది ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడి కల అనేది నిజం. కానీ ఐపీఎల్‌లో తాను సెలెక్ట్ కాలేదని, ఆడలేకపోయానని ఏమాత్రం బాధపడటం లేదని టెస్టుల్లో అద్భుతమైన స్ట్రోక్‌ ప్లే కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందిన చటేశ్వర్ పుజార చెప్పారు. భారత టెస్ట్ క్రికెట్‌లో పరిచయం లేని పేరు పుజారాది. టీమిండియా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. కానీ టెస్టుల్లో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న పుజార పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

దీంతో టీ20 పనికిరాడంటూ కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అంశమే అతన్ని టీ20తో పాటు ఐపీఎల్‌కు దూరం చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో పుజారను ఏ ఐపీఎల్‌ జట్టు కూడా కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. తాజాగా ఐపీఎల్‌ వేలంలో తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంపై చటేశ్వర్‌ పుజార మరోసారి స్పందించాడు. 

ఐపీఎల్‌ 2020 వేలంలో అమ్ముడుపోనందుకు ఏం బాధ లేదు. ఐపీఎల్‌కు ఆడలేకపోతున్నా అనే ఫీలింగ్‌ కూడా లేదు. ఎందుకంటే టీ20ల్లో నాకంటే బాగా ఆడేవాళ్లు చాలా మందే ఉన్నారు అందులో వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న హషీమ్‌ ఆమ్లా లాంటి ఆటగాడు కూడా అమ్ముడుపోని ఆటగాడిగానే మిగిలాడు. ఆమ్లాలా ఇంకా ఎందరో ఉన్నారు.. అందులో నేను ఒకడిని. 

మేము ఐపీఎల్‌లో ఆడడం లేదన్న ఈగో ఫీలింగ్‌ లేదు. నా ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నా. ఇప్పటికి అవకాశమొస్తే అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ నన్ను ఒక టెస్టు ప్లేయర్‌గా మాత్రమే  గుర్తించారు. దానికి నేను కూడా ఏం చేయలేను. టీమిండియాలో నాతో పాటు ఆడే ఆటగాళ్లు ప్రతీసారి ఐపీఎల్‌లో బిజీగా ఉంటే బీసీసీఐ అనుమతితో నేను మాత్రం ఇంగ్లండ్‌ వెళ్లి కౌంటీ క్రికెట్‌లో పాల్గొనేవాడిని. కరోనా కారణంగా ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. 

కౌంటీలో ఆడడం లేదని కొంచెం నిరుత్సాహంగానే ఉన్నా. టీమిండియా తరపున టెస్టుల్లో జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టా. అశేషమైన భారత అభిమానుల మద్దతుతో మ్యాచ్‌లు గెలవడం కన్నా ఇంకా గొప్ప అనుభూతి ఏం ఉంటుంది. టెస్టుల ద్వారా ఇప్పటికే చాలాసార్లు చూశా. ఐపీఎల్‌లో సాధించే విజయం కన్నా దేశంకోసం సాధించే విజయంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేరు' అంటూ చెప్పుకొచ్చాడు. 

టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన పుజార 77 టెస్టులాడి 6వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం 18 సెంచరీలు ఉన్నాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle