newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అందరికంటే ముందుగానే యూఏఈకి ధోనీ..?

26-07-202026-07-2020 07:59:17 IST
Updated On 26-07-2020 14:40:09 ISTUpdated On 26-07-20202020-07-26T02:29:17.266Z26-07-2020 2020-07-26T02:29:10.354Z - 2020-07-26T09:10:09.726Z - 26-07-2020

 అందరికంటే ముందుగానే యూఏఈకి ధోనీ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ భారత్‌ తరపున మళ్లీ క్రికెట్ ఆడతాడా? లేదా? అని సగటు భారత క్రికెట్ అభిమాని మనసులో మెదులుతున్న ప్రశ్న. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టింది లేదు. దాంతో కొన్ని నెలల క్రితం బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి కూడా ధోనీని తొలగించింది.ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2020తో పునరాగమనం చేద్దామనుకున్న ధోనీకి కరోనా వైరస్ ఆశాభంగం కలిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 13వ సీజన్‌పై స్పష్టత రావడంతో.. అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీపై పడ్డాయి.

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ఆగస్టు మూడో వారంలో యూఏఈ పయనం కానున్నాయి. అయితే ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మరో వారం ముందే యూఏఈలో అడుగుపెట్టనుంది. ఆగస్టు రెండో వారంలోనే యూఏఈ చేరుకునేందుకు చెన్నై ప్రాంచైజీ సన్నాహాలు చేస్తోందని సమాచారం తెలుస్తోంది. మిగతా ఫ్రాంచైజీలు ఆగస్టు మూడో వారంలో యూఏఈలో కాలుమోపనున్నాయి.కరోనా వైరస్ మహమ్మారి వల్ల నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైపోవడంతో కొంత ప్రాక్టీస్ అవసరమవుతుందనే ఉద్దేశంతోనే ముందుగా చెన్నై జట్టు యూఏఈ వెళుతున్నట్లు సమాచారం.

ముందుగా వెళ్లడం వల్ల మిగతా జట్ల కంటే ముందుగా ప్రాక్టీస్ ప్రారంభించడమే కాకుండా.. అక్కడి వాతావరణానికి కూడా అలవాటు పడవచ్చని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎంఎస్ ధోనీకి ఎక్కువ ప్రాక్టీస్ లభించనుంది.ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు.

ఆపై వైరస్ కారణంగా రాంచికి వెళ్ళిపోయాడు. చెన్నైలో మహీ ఎంతో కష్టపడ్డాడని తోటి ఆటగాళ్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు.ఇదిలా ఉంటే గత ఐపీఎల్‌ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ను తృటిలో చేజార్చుకుంది. ఒక్క పరుగు తేడాతో ఓడింది. 

ఈసారైనా కచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. చాలారోజులుగా క్రికెట్‌కు దూరమైన మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ సీజన్‌లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని పట్టుదలగా ఉన్నాడు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle