newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అంత రిస్క్ అవసరం లేదు... అక్తర్‌కు కపిల్ కౌంటర్

09-04-202009-04-2020 16:43:58 IST
Updated On 09-04-2020 17:26:33 ISTUpdated On 09-04-20202020-04-09T11:13:58.944Z09-04-2020 2020-04-09T11:13:52.028Z - 2020-04-09T11:56:33.852Z - 09-04-2020

అంత రిస్క్ అవసరం లేదు... అక్తర్‌కు కపిల్ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచం ఇప్పుడు క్రీడల గురించి ఆలోచించడం లేదు. ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఇక ఐపీఎల్ సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్‌ అక్తర్ చేసిన సూచనలపై కపిల్ దేవ్ మండిపడ్డారు. భారతదేశంతో పాటు.. పాకిస్తాన్‌లోనూ కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా ఇరు దేశాలు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడితే బాగుంటుందని సూచించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ల ద్వారా  వచ్చే మొత్తాన్ని రెండుదేశాలు కరోనా నివారణ చర్యలకు ఖర్చుచేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు.

అయితే ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకుండా.. కేవలం టీవీలకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నాడు. దీనిపై ఇప్పటివరకూ భారత్‌ నుంచి స్పందన రాలేదు. తొలిసారి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ మాత్రం గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్‌ చేయాల్సిన అవసరం ఉందా అని అక్తర్‌కు చురకలంటించాడు.  కరోనా కట్టడి కోసం భారత్‌ విరాళాలు కోసం ఇలా సిరీస్‌లు సిద్ధ కావాల్సిన అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది. 

మ్యాచ్ లు ఆడి మరిన్ని  కష్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడం కావాలి. అది వదిలి క్రికెట్‌ సిరీస్‌లు ఏమిటి. ఇప్పటికే కరోనా సంక్షోభంతో ప్రభుత్వానికి బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళం ఇచ్చింది. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే ఈ పరిస్థితుల్లో భారత్‌ క్రికెటర్లు నిధులు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్నారు. 

క్రికెటర్లతో రిస్క్ చేయలేం.. ఆరేడు నెలల పాటు మ్యాచ్ ల  గురించి ఆలోచించడం మంచిది కాదు. అంతా కలిసి మనం చేయాల్సిందల్లా ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి పెట్టాలి. అదే సమయంలో పేద వారి ఆకలి బాధను తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వైరస్‌పై  రాజకీయాలు చేయడం మంచిది కాదు. క్రికెటర్లు కూడా భారీగా విరాళాలు అందించి కరోనా నుంచి బయటపడడం మంచిది అంటూ క్లాస్ పీకాడు కపిల్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle