newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్.. టీంఇండియాపై బంగ్లా విజయం

10-02-202010-02-2020 09:10:13 IST
Updated On 10-02-2020 15:45:55 ISTUpdated On 10-02-20202020-02-10T03:40:13.968Z10-02-2020 2020-02-10T03:39:51.263Z - 2020-02-10T10:15:55.385Z - 10-02-2020

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్.. టీంఇండియాపై బంగ్లా విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ అనూహ్య విజయం సాధించింది. అండర్ -19 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ జట్టు కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌ లో బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ జట్టు గెలుపొందింది. అయితే మ్యాచ్ చివరిలో ఉండగా వర్షంతో అంతరాయం ఏర్పడింది. 

వర్షం కారణంగా భారత్ ఆశలు అడియాశలయ్యాయి. మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఆట నిలిచిన సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 41 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు విజయానికి 15 పరుగుల దూరంలో ఉంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 18 రన్స్ ముందంజలో ఉన్న బంగ్లాదేశ్ కు 27 బాల్స్ లో 6 రన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ పరిస్థితులలో అండర్ -19 వరల్డ్ కప్ ను  బంగ్లాదేశ్ జట్టు సొంతం చేసుకుంది. అయితే ఇలా ఫైనల్ కప్ అందుకోవడం బంగ్లాదేశ్ కి ఇదే తొలిసారి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 177 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ జట్టులో యశస్వి జైస్వాల్ 88(121), తిలక్ వర్మ 38, ధృవ్ జురెల్ 22 మినహా మిగతా బ్యాట్స్ మెన్ లు అంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. క్రీడాస్ఫూర్తికి భిన్నంగా బంగ్లా ఆటగాళ్ళు స్టేడియంలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle